: మరో ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లకు స్వైన్ ఫ్లూ... త్వరలో పోలీస్ అకాడెమీకి కేంద్ర బృందం
భావి ఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దుతున్న హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీ ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూతో వణికిపోతోంది. ఇప్పటికే పది మందికి పైగా ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఈ వ్యాధి భారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు ట్రైనీలకు వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో అకాడెమీలో స్వైన్ ఫ్లూ బారినపడ్డవారి సంఖ్య 18కి చేరింది. నానాటికి వ్యాధి వ్యాప్తి పెరిగిపోవడంపై కేంద్రం దృష్టి సారించింది. త్వరలోనే ఓ బృందాన్ని అకాడెమీకి పంపనుంది. తిరుపతి ఉప ఎన్నిక విధులు ముగించుకుని వచ్చిన తర్వాత ట్రైనీ ఐపీఎస్ లు ఈ వ్యాధి బారినపడ్డారు.