: బెజవాడలో నడిరోడ్డుపై నిలిచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు


ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల సమయంలోనే కాక అకారణంగానూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు, అసలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి ఘటనే రాత్రి విజయవాడలో వెలుగు చూసింది. కాకినాడ నుంచి నిన్న సాయంత్రం హైదరాబాదు బయలుదేరిన దీపక్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్నట్టుండి నిలిచిపోయింది. డ్రైవర్ బస్సును ఎందుకు నిలిపేశాడో కూడా తెలియదు. అర్ధరాత్రి నిలిచిపోయిన బస్సు నేటి ఉదయం దాకా కూడా కదలలేదు. దీంతో ప్రయాణికులు నడిరోడ్డుపైనే జాగారం చేస్తున్నారు. యాజమాన్యాన్ని సంప్రదించేందుకు వారు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కొద్దిసేపటి క్రితం ప్రయాణికులంతా అక్కడే, నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News