: స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న ఏపీ డీజీపీ రాముడు
అఖిల భారత సర్వీసు అధికారులంతా రాష్ట్రంలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకటరాముడు స్పందించారు. తన స్వగ్రామమైన అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ఉన్న నరసింహ్మపల్లిని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో ఆయన రిజిస్టర్ చేయించారు. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నరసింహ్మపల్లిలో డీజీపీ తన స్నేహితులతో కలిసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం కోసం ఓ పాఠశాలను నిర్వహిస్తున్నారు. తాజా పరిణామంతో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని డీజీపీ రాముడు నిర్ణయించారు.