: వలస చట్టాలను కఠినతరం చేస్తున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకు వలస వచ్చే విదేశీయుల విషయంలో ఉన్న చట్టాల్ని, నిబంధనల్ని కఠినతరం చేయనున్నామని ప్రధాని టోనీ అబ్బాట్ తెలిపారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకే తామీ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ లో సిడ్నీలోని ఓ కేఫ్ పై దాడికి దిగిన ఉగ్రవాదులు అక్కడున్నవారిని బందీలుగా చేసుకుని కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. దీనిని ఆస్ట్రేలియన్లు పీడకలగా భావిస్తున్నారని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యతతోనే తామీ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. నేరచరితులెవ్వరినీ తమ దేశంలో అడుగు పెట్టనీయమని ఆయన స్పష్టం చేశారు.