: కర్ణాటక ఆరోగ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది


కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ ప్రయాణిస్తున్న కారు కోల్ కతా సమీపంలో ఓ లోయలో పడింది. అదృష్టవశాత్తు ఆయన, ఆయన సహాయకుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... రోడ్డుపై సాఫీగా సాగిపోతున్న కారు అదుపుతప్పడంతో లోయలో పడిపోయింది. డ్రైవర్ కు గాయాలు కాగా, అతనిని ఆసుపత్రిలో చేర్చారు. కోల్ కతాలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో పడ్డ కారు బాగా దెబ్బతినడంతో, దానిని క్రేన్ సాయంతో బయటకు తీశారు.

  • Loading...

More Telugu News