: ఏపీ రాజధానిపై పవన్ కల్యాణ్ కామెంట్
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అధికార, విపక్షాల వాదనల మధ్య పొంతన కుదరడం లేదు. ఇంతలోనే ఏపీలో ఓ రైతు కుటుంబం ఆవేదనను మహిళ తీవ్రస్థాయిలో వ్యక్తం చేయడం సంచలనం రేపింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, లేదంటే వారి ఆగ్రహానికి గురికావలసి వస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పష్టం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ రాజకీయ రంగప్రవేశంపై మరోసారి ఆసక్తి రేగుతోంది.