: విభజన సమయంలో ప్రతి అంశాన్ని వెంకయ్య, జైట్లీతో చర్చించాం: జైరాం రమేష్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడంతో టీడీపీ పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం పొందిన సందర్భంలో అందులోని ప్రతి అంశంపైనా ప్రస్తుత కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీతో చర్చించామని అన్నారు. ఇప్పుడు వారు విభజన చట్టాన్ని విస్మరించడం బాధాకరమని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ రాజకీయ క్రీడలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం లేదని ఆయన పేర్కొన్నారు.