: కీలక సమయంలో ఫామ్ లోకి...వరల్డ్ కప్ టాప్ స్కోరర్ అతడే!
వరల్డ్ కప్ ముందు భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశపరచిన శిఖర్ ధావన్ కీలక సమయంలో ఫామ్ అందుకున్నాడు. ప్రపంచకప్ లో ఢిఫెండింగ్ ఛాంపియన్ గా దిగుతున్న భారత జట్టు పేలవ ఫామ్ అందరిలోనూ అంచనాలు లేకుండా చేసింది. కనీసం పాకిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే చాలు అని సగటు అభిమాని భావించాడు. అలాగే క్రీడా పండితులు కూడా టైటిల్ ఫేవరేట్ కాదు కానీ, క్వార్టర్స్ వరకు టీమిండియా వెళ్తుందని పేర్కొన్నారు. ఈ దశలో ధావన్ ఫాం అందుకోవడంతో టీమిండియా అభిమానుల్లో ఆశలు రేగుతున్నాయి. పాక్ తో మ్యాచ్ లో 73 పరుగులు చేసి విజయానికి దోహదపడిన శిఖర్, సఫారీలతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ గణాంకాల ప్రకారం 210 పరుగులు చేసిన ధావనే నెంబర్ వన్ బ్యాట్స్ మన్. ఇదే ఫాం కొనసాగిస్తే ధావన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వరల్డ్ కప్ ముందు 10 మ్యాచ్ లాడిన ధావన్ కేలం 216 పరుగులు మాత్రమే చేయగా, వరల్డ్ కప్ లో జరిగిన రెండు మ్యాచుల్లో 210 పరుగులు చేసి టైటిల్ పై ఆశలు రేపుతున్నాడు.