: ఐడీఎల్ లో పేలుడు...నలుగురి పరిస్థితి విషమం


కూకట్ పల్లి ప్రాంతంలోని ఐడీఎల్ సంస్థలో పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి పది మంది వరకు గాయపడినట్లు, నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం. అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐడీఎల్ పెద్ద స్థాయి ఆయిల్ కంపెనీ. కొన్ని వందల ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేశారు. గతంలో ఒకసారి ఇక్కడ రియాక్టర్ల వద్ద పేలుడు సంభవించి, ఇద్దరు కార్మికులు మరణించారు. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహా ఎవరికీ లోపలికి ప్రవేశం లేకపోవడంతో ఘటనపై పూర్తి వివరాలు తెలియడానికి సమయం పడుతుంది. గతంలో ప్రమాదం జరిగినప్పుడు కూడా వివరాలు తెలియడానికి 15-20 రోజుల సమయం పట్టింది.

  • Loading...

More Telugu News