: శునకాల పందేలు అక్కడ ఫేమస్...బహుమతి కోసం కాట్లాట
సంక్రాంతి అంటే మనందరికీ గుర్తుకొచ్చేది కోడి, పొట్టేలు, ఎడ్లబళ్ల పందేలు. చైనాలో కూడా అదే సంప్రదాయం ఉంటుంది. కానీ కాస్త విభిన్నంగా! చైనాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రధానంగా శునకాల పందేలు జరుగుతాయి. శునకాల పందేలంటే, బాక్సింగ్ లా ఉంటాయి. రెండు కుక్కలను బరిలో వదులుతారు. ఆ రెండు కుక్కలూ కసిదీరా కరుచుకుంటాయి. ఏది విజేతగా నిలుస్తుందో దానికి సిగిరెట్ పాకెట్ బహుమతిగా ఇస్తారు. ఆ సిగిరెట్ పాకెట్ ను ఓడిన వారు గెలిచిన వారికిస్తారు. దానిని వెలిగించి ఇద్దరూ స్నేహం వ్యక్తం చేస్తారు. స్నేహం ముందు, పోటీ తరువాత అనే దృక్పథంతో నిర్వహిస్తారు.