: కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యేకు కేసీఆర్ ఫోన్?


జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో, హైదరాబాదులో బలం పెంచుకునే పనిలో పడ్డారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ కు కేసీఆర్ స్వయంగా తెరతీశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నగరానికి చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి లాక్కున్న కేసీఆర్... మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా దృష్టి సారించారని సమాచారం. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకు కేసీఆరే స్వయంగా ఫోన్ చేస్తున్నారని... తనను కలవాలని కోరుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తనకు కూడా కేసీఆర్ ఫోన్ చేశారని కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. వాస్తవానికి గతంలోనే మాధవరంకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. దీంతో, ఇప్పుడు మరోసారి ఫోన్ వచ్చినట్టయింది.

  • Loading...

More Telugu News