: జాతీయ బ్యాంకుల ఉద్యోగుల సంఘం సమ్మె నిర్ణయం విరమణ
ఈ నెల 25 నుంచి సమ్మె చేయాలన్న నిర్ణయాన్ని జాతీయ బ్యాంకుల ఉద్యోగుల సంఘం విరమించుకుంది. 28 వరకు డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేయనున్నట్టు ఈరోజు సంఘం నేతలు పిలుపునిచ్చారు. దాంతో వారితో ప్రభుత్వం తరపున భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) చర్చలు జరిపింది. ఈ సమయంలో తమ వేతనాలు పెంచాలన్న ఉద్యోగుల సంఘం డిమాండ్ కు ఐబీఏ అంగీకరించడంతో చర్చలు సఫలమయ్యాయి. ఆ వెంటనే సమ్మె ఉపసంహరించుకుంటున్నట్టు ఉద్యోగుల సంఘం నేతలు ప్రకటించారు.