: కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ అరెస్ట్
కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ను ఈ మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. చండీఘడ్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన అరెస్ట్ కు గల కారణాలు తెలియాల్సివుంది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేసిన ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వేలో ఉద్యోగాలకు సంబంధించి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చి ఆయనను అరెస్ట్ చేయడంతో, ఆ ఘటనకు నైతిక బాధ్యతగా, బన్సల్ తన పదవికి రాజీనామా చేశారు.