: రేపటి మ్యాచ్ కు డారెన్ బ్రావో అవుట్


ప్రపంచ కప్ లో భాగంగా రేపు కాన్ బెర్రాలోని మనుకా ఓవల్ స్టేడియంలో జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాడు డారెన్ బ్రావో ఆడటం లేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. మోకాలి గాయం కారణంగా బ్రావో మ్యాచ్ ఆడడం లేదని టీం మేనేజ్ మెంట్ ట్విట్టర్ లో తెలిపింది. సౌతాఫ్రికాతో సిడ్నీలో జరిగే మ్యాచ్ నాటికి బ్రావో ఫిట్ గా ఉంటాడని భావిస్తున్నట్టు మేనేజ్ మెంట్ తెలిపింది. కాగా, ప్రాక్టీస్ సందర్భంగా డారెన్ బ్రావో గాయపడ్డాడు. గత మ్యాచ్ లో డారెన్ బ్రావో మంచి ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News