: కొడుకు, అల్లుడికే ఎక్కువ నిధులు: కేసీఆర్ ఫై షబ్బీర్ విమర్శలు


టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ చేస్తున్న విమర్శల దాడి నానాటికీ పెరుగుతోంది. ప్రచారం కోసం, గొప్పలు చెప్పుకోవడం కోసం లక్ష కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం.... కేవలం 29 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసిందని అలీ విమర్శించారు. కేటాయింపుల్లో కూడా, ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుల శాఖలకే ఎక్కువ నిధులు కేటాయించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. యూనివర్శిటీలను కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో ఎక్కువ యూనివర్శిటీలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్న సంగతిని శ్రీహరి గుర్తుంచుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News