: సిలువ వేయించుకున్న జయలలిత అభిమాని
తమిళనాట అభిమానానికి హద్దులు లేవు. అభిమాన నటి, నటుడు, రాజకీయనాయకుడి కోసం ఏదయినా చేసేందుకు అభిమానులు సదా సంసిద్ధులై ఉంటారు. అభిమానం చూపించుకునేందుకు కూడా వినూత్న విధానాలు వెతుకుతుంటారు. తాజాగా సీహాన్ హుస్సేన్ అనే అభిమాని మాజీ ముఖ్యమంత్రి జయలలితను మళ్లీ సీఎం చేయాలని కోరుతూ సిలువ వేయించుకున్నాడు. సిలువకు ఆరు అంగుళాల మేకులతో కాళ్లు, చేతులకు దిగగొట్టించుకున్నాడు. మేకులు కొడుతుండగా అమ్మా అంటూ కేకలు వేశాడు. అమ్మకు న్యాయం చేయాలని సిలువపై నుంచి దేవుడ్ని ప్రార్థించాడు. కాసేపటి తరువాత మేకులు తొలగించి అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, అవినీతి కేసులో శిక్ష పడిన జయలలిత పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.