: తెలుగు సినిమా తీయాలనుకుంటున్న యమధర్మరాజు!


యమలోక పాలకుడు యమధర్మరాజు ఒక తెలుగు సినిమాను తీయాలని భావించాడేమోనని అనిపిస్తోంది. తెలుగు సినీ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే. ఇప్పటికే ఆయనకు దాదాపుగా ఒక ఫుల్ టీం తయారైపోయింది కూడా. సినిమాకు ప్రధానంగా కావాల్సిన నిర్మాతగా రామానాయుడు, దర్శకత్వ బాధ్యతలను బాపు రమణ లేదా బాలచందర్ కు అప్పగించే ఆలోచనలో ఆయన ఉన్నారనిపిస్తోంది. ఇక హీరోగా ఉదయ కిరణ్, విలన్ గా శ్రీహరి, హీరో తల్లిదండ్రుల పాత్రలకు అక్కినేని, అంజలి, కమెడియన్ లుగా ఏవీఎస్, తెలంగాణ శకుంతల, ఎం.ఎస్.నారాయణలను ఎంచుకున్నారట. పాటలు, మాటల రచయితగా వేటూరి, మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రి, గాయకుడిగా మురళి ఇలా చిత్ర నిర్మాణానికి కావాల్సిన వారిని తన దగ్గరికి పిలుస్తున్నాడని ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఒక పోస్టింగ్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఆలోచనను యముడు విరమించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News