: నీరు ఇవ్వకుంటే నిరాహారదీక్ష చేస్తా: జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి ప్రాంతానికి తక్షణం నీటిని విడుదల చేయాలని, లేకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ఆ నియోజకవర్గ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. హెచ్‌ఎల్‌సీ నుంచి తక్షణం నీటిని విడుదల చేసి ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. నీరు రాకుంటే హెచ్‌ఎల్‌సీ ఆఫీసు ఎదుట మంగళవారం నాడు నిరాహారదీక్షకు కూర్చుంటానని ఆయన స్పష్టం చేశారు.