: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి... పార్లమెంటు బయట కాంగ్రెస్ ఎంపీల నిరసన
బడ్జెట్ సమావేశాల తొలిరోజు కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఇంకా విభజన సందర్భంగా రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలోకి తీసుకురావాలని ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు బయట గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, జేడీ శీలం, సుబ్బరామిరెడ్డి, పళ్లంరాజు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.