: తెలంగాణ డిప్యూటీ సీఎంకు నిమ్స్‌లో వైద్య పరీక్షలు


తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఈ ఉదయం హైదరాబాదు, పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఒంట్లో నలతగా ఉండటంతో ఆయన ఆసుపత్రికి వచ్చినట్టు తెలిసింది. అక్కడ ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో మహమూద్ అలీకి ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. అనంతరం నిమ్స్‌ లో చికిత్స పొందుతున్న సినీనటుడు కృష్ణంరాజును మహమూద్ అలీ పరామర్శించారు.

  • Loading...

More Telugu News