: ప్రయాస్ జైన్ ఆ పత్రాలను పాక్, చైనాలకు అమ్మాడా?... కార్పొరేట్ గూఢచర్యంలో కొత్త కోణం
కార్పొరేట్ గూఢచర్యం కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. తాజాగా సోమవారం వెలుగుచూసిన విషయం వాస్తవమే అయితే, దేశ ఆర్థిక రంగం కుదేలయ్యే ప్రమాదం లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ గూఢచర్యం కేసులో అరెస్టైన ప్రయాస్ జైన్, తాను తస్కరించిన కీలక పత్రాలను శత్రుదేశం పాకిస్థాన్ తో పాటు మరో పొరుగు దేశం చైనాకు విక్రయించాడట. జైన్ వెబ్ సైట్ ను పరిశీలించిన విచారణాధికారులు, అందులో కొంతమంది విదేశీయులున్నారని గుర్తించారు. అంతేకాక విచారణలో భాగంగా విదేశాలకు చెందిన 250 మంది దాకా వ్యక్తులు, సంస్థలు తన క్లయింట్ల జాబితాలో ఉన్నట్లు జైన్ ఒప్పుకున్నాడు. ఈ క్లయింట్లందరూ ఇంధన, బొగ్గు, చమురు రంగాలకు చెందిన వారేనని అతడు వెల్లడించాడట.