: మనీ - లవ్ మధ్య పోటీలో మనీదే విజయం!


ప్రేమా కావాలా? డబ్బు కావాలా? ఈ రెండూ పోటీపడితే అత్యధిక సార్లు డబ్బుదే విజయమట. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎన్నో జంటలు డబ్బు సృష్టించిన సమస్యల వల్లే విడిపోయినట్టు తేలింది. ఈ సర్వే వివరాల ప్రకారం, వివాహానికి ముందు, వివాహం చేసుకున్న కొత్తల్లో సహచరిపై చూపే ప్రేమను చాలామంది ఎక్కువకాలం కొనసాగించలేకపోతున్నారు. మహిళలు సైతం తమ భర్తలపై కొత్తల్లో ఉన్నంత ప్రేమగా ఉండటం లేదు. దీనికి ముఖ్య కారణం వారిమధ్య డబ్బుకు సంబంధించిన చర్చలు నిత్యమూ వస్తుండటమే. ఆర్థికపరమైన విషయాలపై చర్చ విభేదాలకు దారితీసి వారి మధ్య ప్రేమను చంపి విడిపోయేలా చేస్తోందట. ఇక డబ్బు వ్యవహారాలు పక్కనబెట్టి ప్రేమకు కట్టుబడే జంటల సంఖ్య తక్కువేనని సర్వే చెబుతోంది.

  • Loading...

More Telugu News