: జంతర్ మంతర్ వద్ద హజారే నిరసన దీక్ష ప్రారంభం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే నిరసన దీక్ష ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా హజారే ఈ దీక్షకు ఆహ్వానించారు. అయితే వేదికపై కాకుండా ప్రజల మధ్యలో కూర్చుని తన నిరసన తెలపాలని అన్నా సూచించారు. అటు ఈ సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలవనున్నారు.