: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం... హైలైట్స్-3
పార్లమెంటు సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని హైలైట్స్ ఇవే... * దేశాభివృద్ధిని వేగవంతం చేయడానికే ఎఫ్ డీఐ పరిమితులను సరళీకరించాం. * అవసరమైన నిధులు, టెక్నాలజీ కోసమే రైల్వేలలో కొంతమేర ఎఫ్ డీఐలను అనుమతించాం. * మన ఆర్థిక ప్రగతిలో రైల్వేలది కీలక పాత్ర. * తీరప్రాంతాల అభివృద్ధి కోసం 'సాగర్ మాల' కార్యక్రమం. * అన్ని రాష్ట్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి ప్రాధాన్యత. దీని కోసం భారీగా నిధుల కేటాయింపు. * విద్యుత్ కొరతను తీర్చడానికే బొగ్గు క్షేత్రాల వేలం ప్రక్రియను ప్రారంభించాం. * ఏడాదికి 1000 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. * ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం. దీనికోసం ప్రజలు, రాష్ట్రాల సహకారం తీసుకుంటాం. * మా ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 14 తగ్గింది. * ఏపీ, ఒడిశాల సమన్వయంతో హుదూద్ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. * సార్క్ దేశాల అభివృద్ధి కోసం ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతాం. * ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేని 1,741 చట్టాలను మార్చివేస్తాం. * ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తాం. * 25 మెగా సోలార్ పార్కులను త్వరలోనే ఏర్పాటు చేస్తాం. * ప్రకృతి వనరుల కేటాయింపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తాం. * షిప్పింగ్ ఇండస్ట్రీని పరుగులు పట్టిస్తాం. * ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చు.