: సెలవులో రాహుల్ గాంధీ... పార్టీ ప్లీనరీకి సన్నద్ధమయ్యేందుకు లీవు తీసుకున్నారట!


వరుస ఓటములతో తల బొప్పి కట్టిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ సెలవులో వెళ్లిపోయారట. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనా బెణకని రాహుల్, ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు మాత్రం బెంబేలెత్తిపోయారట. 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆ పార్టీ, మొన్నటి ఎన్నికల్లో సింగిల్ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో హతాశుడైన రాహుల్, సెలవు తీసుకోవాల్సిందేనని నిర్ణయించుకున్నాడట. నేరుగా పార్టీ అధ్యక్షురాలు, తన తల్లి సోనియా గాంధీ వద్దకెళ్లి సెలవు గురించి ప్రస్తావించారు. సోనియా గాంధీ సెలవు మంజూరు చేయడంతో వెనువెంటనే ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ లో జరగనున్న పార్టీ ప్లీనరీ నాటికి సరికొత్త ఉత్సాహంతో ఆయన పునరాగమనం చేయనున్నారట. ప్లీనరీ అనంతరం రాహుల్ మరింత కీలక బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్లీనరీ నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News