: మహిళల భద్రత కోసం 'హిమ్మత్' యాప్: రాష్ట్రపతి
దేశంలోని మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. మహిళల భద్రతకు 'హిమ్మత్' యాప్ ప్రవేశ పెట్టామని పార్లమెంటులోని తన ప్రసంగంలో ప్రకటించారు. అటు ఆడ పిల్లల విద్య, రక్షణ కోసం 'బేటీ బచావ్-బేడీ పడావ్' కార్యక్రమం ద్వారా బాలికల సంరక్షణ చేపడుతున్నట్టు తెలిపారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.