: సిడ్నీలో అర్ధరాత్రి క్రికెటర్ చక్కర్లు... ఇంటికి పంపాలని నిర్ణయం


రాత్రి 10 గంటలు దాటితే బయట తిరగవద్దని, తప్పనిసరైతే ముందస్తు అనుమతి తీసుకోవాలన్న క్రమశిక్షణా నిబంధనలు ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ పేసర్ అల్ అమీన్ హుస్సేన్‌ ను స్వదేశానికి పంపాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. రాత్రి 10 గంటల్లోపు జట్టు ఆటగాళ్లు హోటల్‌ కి రావాలనే నియమాన్ని ఈనెల 19న అల్ అమీన్ ఉల్లంఘించాడని ఆ జట్టు మేనేజర్ ఖాలిద్ మహ్మూద్ వివరించాడు. వీలైనంత త్వరగా అతడ్ని బంగ్లాదేశ్‌ కు తిరిగి పంపించనున్నామని తెలిపాడు. కాగా, అమీన్ ఈ వరల్డ్ కప్‌లో ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

  • Loading...

More Telugu News