: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం... హైలైట్స్-1
పార్లమెంటు సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని హైలైట్స్ ఇవే... * 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' అనేది మా ప్రభుత్వ నినాదం * పారిశుద్ధ్యానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. * 2019 అక్టోబర్ నాటికి స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాధిస్తాం. * ఎంపీ లాడ్స్ నిధుల్లో 50 శాతం నిధులను స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేటాయించాలి. * 2019 అక్టోబర్ నాటికి బహిరంగ మలవిసర్జన లేని దేశంగా రూపొందిస్తాం. * 2015 ఆగస్టు నాటికి దేశంలోని అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం * జన్ ధన్ యోజన వంద శాతం విజయవంతం కాబోతోంది. జన్ ధన్ ఖాతాల్లో రూ. 11 వేల కోట్లు జమ అయ్యాయి. 13.2 కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. * నగదు బదిలీ, పహల్ పథకాలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. * సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల మధ్య పోటీని పెంచుతాం. * 2022కల్లా అందరికీ ఇళ్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. * ఉపాధికల్పన నుంచి సంపద సృష్టి వరకు ప్రభుత్వ ప్రాధాన్యం. * 35 పథకాలను నగదు బదిలీ కిందకు తీసుకువస్తాం. * అభివృద్ధి అన్నది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సాగాలి. * భూసేకరణ వల్ల రైతులకు మేలు జరగాలన్నదే మా ఉద్దేశం. * భూసేకరణ విధానంలో నిబంధనలను సరళీకరించాల్సి ఉంది. * సాయిల్ హెల్త్ కార్డ్ పథకాన్ని ఈ ఏడాది చేపడుతున్నాం. * దేశవాళీ ఆవుజాతుల అభివృద్ధి కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఏర్పాటు.