: గుంటూరులో ఒకటైన అలీ సోదరుడు ఖయ్యూం, అర్షియా


ప్రముఖ హాస్యనటుడు అలీ సోదరుడు, సినీనటుడు మహ్మద్ ఖయ్యూం వివాహ వేడుక గుంటూరులోని సన్నిధి కల్యాణ మండపంలో వైభవంగా జరిగాయి. గుంటూరు వ్యాపారవేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్ద కుమార్తె అర్షియా కమాల్ తో ఖయ్యూంకు వివాహమైంది. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ సినీనటులు శ్రీకాంత్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, దర్శకుడు కృష్ణవంశీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, నటుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీ మోహన్, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News