: బతికున్నానంటే ఆయన చలవే... తాలిబన్ చెరనుంచి బయటపడ్డ ప్రేమ్ కుమార్
ఫాదర్ అలెక్సీస్ ప్రేమ్ కుమార్. సుమారు 9 నెలల క్రితం తాలిబన్లకు బందీగా చిక్కి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవతో, తాలిబన్ల చెర నుంచి ఆయనకు విముక్తి లభించింది. కాబూల్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన తన విడుదలకు కృషి చేసిన మోదీకి కృతఙ్ఞతలు తెలిపారు. మోదీ లేకుంటే తన ప్రాణాలు పోయుండేవని తెలిపారు. తాను తాలిబన్ల చెర నుంచి బయటపడి కాబూల్ విమానాశ్రయానికి చేరిన తరువాత మోదీ స్వయంగా మాట్లాడారని వివరించారు. త్వరలోనే భార్య పిల్లలతో కలసి వెళ్లి ఆయనను కలుస్తానని తెలిపారు. అంతకుముందు, ప్రేమ్ కుమార్ విడుదల కానున్నాడని మోదీ ట్వీట్ చేశారు. క్రైస్తవులను ఎలాంటి సమస్యల నుంచైనా రక్షించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వారంలోపే ప్రేమ్ కుమార్ విడుదల కావడం గమనార్హం.