: డెక్కన్ క్రానికల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ


డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్మన్ రవిరెడ్డిలను చంచల్ గూడ జైలు నుంచి సీబీఐ కస్డడీలోకి తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 27 వరకు వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ కోర్టు రెండు రోజుల కిందట అనుమతించింది. ఈ క్రమంలో ఐదు రోజులపాటు సీబీఐ అధికారులు వారిద్దరినీ న్యాయస్థానం షరతు మేరకు హైదరాబాదు సుల్తాన్ బజార్ లోని సీబీఐ కార్యాలయంలో విచారించనున్నారు. నకిలీ పత్రాలతో కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో వెంకట్రామిరెడ్డిని, రవిరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News