: కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామంటున్న టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి


ఓ వైపు ఎన్డీయే ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరబోతోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు తన కూతురు కవితకు మంత్రి పదవి ఇప్పించుకోవడానికి టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇంకోవైపు, ఇవన్నీ అవాస్తవాలు అంటూ టీఆర్ఎస్ నేతలు కొట్టి పారేస్తున్నారు. అసలేం జరుగుతోందో అర్థం కాక, జనాలు మాత్రం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ, లోక్ సభలో ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. అయితే, పదవులపై వ్యామోహం తమకు లేదని... బంగారు తెలంగాణ సాధించుకోవడంలో భాగంగా తమ డిమాండ్లు సాధించుకోవడం కోసమే కేంద్రానికి సహకరిస్తామని తెలిపారు. కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులను చూశాక, కేసీఆర్ తో సమావేశమవుతామని... ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. కాకతీయ మిషన్, వాటర్ గ్రిడ్ వంటి పథకాలకు కేంద్ర బడ్జెట్ లో నిధులు ఇవ్వాలని కోరతామని తెలిపారు.

  • Loading...

More Telugu News