: సౌతాఫ్రికా జట్టుపై మరో దెబ్బ... ఇంకోసారి జరిగితే డివిలియర్స్ సస్పెన్షన్!


వరల్డ్ కప్-2015 పోటీల్లో భాగంగా భారత జట్టు చేతిలో అపజయం పాలైన సఫారీలపై మరో దెబ్బ పడింది. నిన్నటి మ్యాచ్ లో స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసినందుకు దక్షిణాఫ్రికా క్రికెటర్లపై అధికారులు జరిమానా విధించారు. నిర్దేశిత సమయానికి ఒక ఓవర్ ను తక్కువగా వేయడంతో, దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లపై 10 శాతం జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లోగా దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవరేట్ తో బౌలింగ్ చేస్తే కెప్టెన్ డివిలియర్స్ పై ఒక మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News