: ఢిల్లీలో కాల్పుల కలకలం... హోంశాఖ వాహనంపై దుండగుల దాడి, డ్రైవర్ కు తీవ్ర గాయాలు


దేశ రాజధాని ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర హోం శాఖకు చెందిన ఓ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో కారు డ్రైవర్ హైదర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన నగరంలోని ఎయిమ్స్ కు తరలించారు. మరికొద్ది సేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన మరుక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు, కాల్పులకు పాల్పడ్డ దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News