: చిన్నపాండ్రాకలో మరోమారు గ్యాస్ లీక్... అదుపు చేస్తున్నామన్న కృష్ణా జిల్లా కలెక్టర్


కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని చిన్నపాండ్రాక పరిధిలోని ఓఎన్‌ జీసీకి చెందిన గ్యాస్ పైప్‌ లైన్‌ లో నేటి ఉదయం మరోమారు గ్యాస్ లీకేజీ చోటుచేసుకుంది. నిన్న రాత్రి గ్యాస్ లీక్ కాగా, అధికారుల తక్షణ చర్యలతో అదుపులోకి వచ్చినట్లే వచ్చి, నేటి ఉదయం మళ్లీ గ్యాస్ ఎగసిపడింది. గ్యాస్ లీకేజీ కారణంగా ఇప్పటికే గ్రామంలోని పంట పొలాలు పాడయ్యాయి. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ఓఎన్ జీసీకి చెందిన పది మంది అధికారులు చర్యలు చేపడుతున్నారని కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు చెప్పారు. జరిగిన నష్టానికి సంబంధించి పరిహారం ఇప్పిస్తామని ఆయన చెబుతున్నారు. 24 గంటలు గడవకముందే రెండు సార్లు గ్యాస్ లీక్ కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News