: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం... ఉత్తమ సహాయ నటుడిగా జేకే సిమ్మన్స్
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. అవార్డుల ప్రదానోత్సవానికి హాలీవుడ్ ప్రముఖ నటులతో పాటు పలు దేశాలకు చెందిన నటీ నటులు కూడా హాజరుకావడంతో లాస్ ఏంజెలిస్ లో పండుగ వాతావరణం నెలకొంది. అవార్డుల్లో భాగంగా ఉత్తమ సహాయ నటుడిగా 'విప్ లాష్'లో అద్భుత నటనకు గాను జేసే సిమ్మన్స్ ఎంపికయ్యాడు. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఐడా (పోలండ్) అవార్డు దక్కించుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో వెటరన్ ప్రెస్1 కు అవార్డు లభించింది.