: తిరుమలలో భారీ చోరీ... ఎమ్మెల్యే బాబూరావుకు చెందిన రూ. 5 లక్షల గొలుసు చోరీ


తిరుమలలో నేటి ఉదయం భారీ చోరీ వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బాబూరావుకు చెందిన రూ.5 లక్షల విలువ చేసే బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లారు. వెంకన్న దర్శనం కోసం నిన్న తిరుమల వెళ్లిన బాబూరావు అక్కడి జీఎంఆర్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. రాత్రి సమయంలో ఆయన గదిలోకి ప్రవేశించిన దొంగలు విలువైన బంగారు గొలుసును అపహరించారు. నేటి ఉదయం విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News