: పార్లమెంటులో ఎంపీలు... జంతర్ మంతర్ వద్ద అన్నా హజారే: వేడెక్కిన భూసేకరణ చట్టం


కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ చట్టం నేడు దేశ రాజధాని ఢిల్లీలో వేడి పుట్టించనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బిల్లును అడ్డుకోవాలని విపక్షాలు ఇప్పటికే తీర్మానించాయి. తొలిరోజు నుంచే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇదే అంశంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే నేటి నుంచి జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల దీక్షను ప్రారంభించనున్నారు. బిల్లుపై కేంద్రం పునరాలోచించాలని, రైతు ప్రయోజనాలను కాలరాసేలా ఉన్న అంశాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News