: షారూఖ్ ఖాన్ కు 'నో' చెప్పిన టెలివిజన్ తార
బాలీవుడ్ లో టీవీ భామలకు బాలీవుడ్ స్టార్లంటే లెక్కలేనట్టు కనిపిస్తోంది. ఫరాఖాన్ హోస్ట్ చేస్తున్న టీవీ షో ‘ఫరా కీ దావత్’లో అభిషేక్ బచ్చన్ ఎపిసోడ్ కు ఇద్దరు బుల్లితెర నటీమణులు నో చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి సర్గుణ్ మెహతా ఏకంగా బాలీవుడ్ బాద్షాతో కలసి పని చేసే అవకాశం వదిలేసుకుంది. సర్గుణ్ మెహతాకు షారూఖ్ అంటే వల్లమాలిన అభిమానం. అభిషేక్ తో ఎపిసోడ్ కు టీవీ నటులిద్దరూ నో చెప్పిన తరువాత ఫరాఖాన్, సర్గుణ్ ని పిలిచి ఆ అవకాశం గురించి చెప్పింది. సాధారణంగా షారూఖ్ తో అనగానే ఎగిరి గంతేయాల్సిన సర్గుణ్ నో అనేసిందట. షారూఖ్ ఖాన్ తో కలసి సినిమాలో పనిచేసేందుకు సిద్ధమే కానీ ఇలా చేయలేనని చెప్పిందట. దీంతో ఫరా షాక్ తింది.