: నా ఇంటి ముందు నామఫలకం తెలుగులోనే ఉంటుంది: జస్టిస్ ఎన్.వి.రమణ
తమ ఇంటిముందు నామఫలకంపైన తన పేరు తెలుగులోనే ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. విజయవాడలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపులో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, చిన్నతనం నుంచీ తాను ఎన్నో పుస్తకాలు చదువుకున్నానని అన్నారు. తెలుగునాట ఎందరో రచయితలు ఉన్నారని, వారికందరికీ వందనాలని ఆయన చెప్పారు. రాచకొండ విశ్వనాధశాస్త్రి తనకు బాగా నచ్చిన రచయిత అని ఆయన పేర్కొన్నారు. తెలుగునాట రచయితలకు మరింత ప్రోత్సాహం అందాలని ఆయన అభిప్రాయపడ్డారు.