: డివిలీర్స్, డుప్లెసిస్ అవుట్...సౌతాఫ్రికా 133/4


సౌతాఫ్రికా జట్టు వేగం పెంచింది. 308 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు తొలి రెండు వికెట్లను తక్కువ వ్యవధిలోనే కోల్పోవడంతో జాగ్రత్త పడింది. డివిలీర్స్, డుప్లెసిస్ దక్షిణాఫ్రికా జట్టు భారాన్ని భుజాలపై వేసుకుని సింగిల్స్ వచ్చే చోట రెండు పరుగులు చేస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. స్కోరు బోర్డు వేగం పెంచే క్రమంలో డివిలీర్స్ పాయింట్ దిశగా కొట్టిన బంతికి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఇంతలో పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న మోహిత్ శర్మ బంతిని వేగంగా అందుకుని బలంగా విసిరాడు. దానిని అందుకున్న ధోనీ వికెట్లను గిరాటేశాడు. దీంతో మూడో వికెట్ గా డివిలీర్స్ (30) వెనుదిరిగాడు. దీంతో డుప్లెసిస్ (55) కి మిల్లర్ (14) జత కలిశాడు. మోహిత్ శర్మ వేసిన అద్భుతమైన బంతిని పుల్ చేయబోయిన డుప్లెసిస్ ధావన్ కు దొరికిపోయాడు. దీంతో 29 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు 133 పరుగులు సాధించింది.

  • Loading...

More Telugu News