: తొలి వికెట్ పడగొట్టింది... సౌతాఫ్రికా 12/1
భారత్ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ (7) షమీ బౌలింగ్ లో కోహ్లీకి దొరికిపోయాడు. సఫారీలు ప్రస్తుతం 3.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 12 పరుగులు చేశారు. మరో ఓపెనర్ ఆమ్లాకు తోడు డుప్లెసిస్ బ్యాటింగ్ కు దిగాడు. కాగా, ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా మెల్ బోర్న్ లో జరుగుతున్న మ్యాచ్ లో ధోనీ సేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307పరుగులు సాధించింది. ఓపెనర్ ధవన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 137) ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపగా, రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) చెలరేగి మెరిశాడు.