: ముంబైలో విగ్రహానికి జడ్ ప్లస్ సెక్యూరిటీ
అరేబియా సముద్రంలో ఏర్పాటు చేసిన 190 అడుగుల ఎత్తైన చత్రపతి శివాజీ మహారాజ్ స్మారక విగ్రహానికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1900 కోట్ల నిధులు కేటాయించింది. ఈ ప్రాంతాన్ని సందర్శక స్థలంగా తీర్చిదిద్దాలని, కంటికి కనిపించని రాడార్లు, జాతీయ భద్రతా దళం కాపలాను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విగ్రహం సమీపంలో బంకర్లు ఏర్పాటు చేయాలని, అక్కడ ప్రత్యేక భద్రత విభాగాన్ని ఉంచాలని ప్రతిపాదనలు చేసింది. మరోమారు 26/11 పునరావృతం కాకుండా చర్యలు చేపట్టే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రోజూ వేల మంది సందర్శించే విగ్రహానికి చుట్టూ 16 హెక్టార్లలో 2.6 కిలోమీటర్ల దూరం నుంచి రాడార్ల వ్యవస్థను వినియోగించడంతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఉంచడానికి చర్యలు చేపట్టింది.