: మమత బెనర్జీ సన్నిహితుడి అరెస్ట్... ఆమె చూస్తుండగానే!


పశ్చిమ బెంగాల్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న షిబాజి పంజాను కోల్ కతా విమానాశ్రయంలో పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలసి మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటనను ముగించుకొని వచ్చిన ఆయనను విమానం దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ ను చూసిన మమత అధికారులపై మండిపడ్డట్టు సమాచారం. పోలీసులు ఈ చర్యను సమర్ధించుకున్నారు. ఆయనపై ఈ నెల 19న ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినందునే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ఓ కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News