: దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 308
మెల్ బోర్న్ లో జరుగుతున్న వరల్డ్ కప్ పోటీలో భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. మరికాసేపట్లో 308 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగనుంది. భారత బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ 16 ఫోర్లు 2 సిక్స్ ల సాయంతో 137 పరుగుల భారీ స్కోర్ చేశాడు. 60 బంతులాడిన రహానే 7 ఫోర్లు 3 సిక్స్ లు బాది 79 పరుగులు చేయగా, వైస్ కెప్టెన్ కోహ్లీ 46 పరుగులు చేశాడు. రహానే అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన ధోనీ సైతం వేగంగా జట్టు స్కోర్ ను 300 పరుగుల మైలురాయిని దాటించాడు. 10 బంతులాడి 18 పరుగులు చేసిన ధోనీ 49వ ఓవర్లో మార్కెల్ వేసిన బంతిని కీపర్ కు క్యాచ్ ఇచ్చి 7వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కెల్ కు 2, స్టెయిన్, పర్నేల్, తాహిర్ లకు తలా ఒక వికెట్ దక్కింది.