: కనీస జ్ఞానంలేని నువ్వా మమ్మల్ని విమర్శించేది?: పొన్నంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిప్పులు
కనీస పరిజ్ఞానం లేని వారంతా తమపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తమపై ఆరోపణలు చేస్తున్న పొన్నం ప్రభాకర్ కు విద్యాశాఖ గురించి ఏమి తెలుసని ఆయన ప్రశ్నించారు. నేడు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు సమాచారంతో లేనిపోని ఆరోపణలు చేసిన పొన్నం వాటిని రుజువు చేయాలని, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు వెళ్తామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు.