: విజయవాడలో 10 మంది బుకీల అరెస్ట్
విజయవాడ పోలీసులు మరో బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఒక వైపు వరల్డ్ కప్ మ్యాచ్లు జోరుగా జరుగుతుండగా మరోవైపు బెట్టింగ్ బాబులు రెచ్చి పోతున్నారు. విజయవాడలోని క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించి 10 మంది బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.42 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ లు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నట్టు అనుమానాలు వున్నాయి. తమ అభిమాన బౌలర్, బ్యాట్ మెన్ లపై వ్యక్తిగత పందాలు, మరికొందరు టీం జయాపజయాలపై పందాలు కాస్తున్నట్టు సమాచారం.