: వంద రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న రైల్వే బడ్జెట్!


ఈ నెల 26న కేంద్రం ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్ లో 100కు పైగా కొత్త రైళ్లు ప్రకటించవచ్చని సమాచారం. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులతో పాటు అన్ని రాష్ట్రాలకు కొత్త రైళ్లను తీసుకొచ్చేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం 160 రైళ్లను బడ్జెట్ లో భాగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ఈ ఏడూ మరో వందకి పైగా రెళ్లను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, రైళ్లపై ప్రముఖ బ్రాండ్ కంపెనీలు 'కోకా కోలా ఎక్స్ప్రెస్', 'హల్దీరామ్' వంటి కంపెనీల ప్రకటనలు తీసుకునేందుకు మంత్రి సురేశ్ ప్రభు ప్రతిపాదనలు పెట్టనున్నట్టు సమాచారం. జనరల్, సెకండ్ క్లాస్ బోగీలుండే 'సాధారణ్ ఎక్స్ప్రెస్' రైలు సర్వీసులను సామాన్యులకు అందుబాటులో ఉండేలా తీసుకురానున్నారు. కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు సందర్శకులను దృష్టిలో ఉంచుకుని కొత్త సర్వీసులను ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News