: సెంచరీ 'శిఖరం'... పెరిగిన భారత్ రన్ రేట్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న క్రికెట్ పోటీలో ఓపెనర్ శిఖర్ ధావన్ తన సొగసైన ఆటతీరుతో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 122 బంతులాడిన ధావన్ 14 ఫోర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. తొలి 50 పరుగులను చేయడానికి 78 బంతుల్లో, రెండో 50 పరుగులు 54 బంతుల్లో చేసిన భారత్ అక్కడినుంచి స్కోర్ వేగం పెంచి, 47 బంతుల్లో 100 నుంచి 150 పరుగులకు చేరింది. విరాట్ కోహ్లీ 46 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కోహ్లీ స్థానంలో వచ్చిన రహానే నిలకడగా ఆడుతున్నాడు. రహానే 28 పరుగుల వద్ద ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 35 ఓవర్లలో 183/2.