: ఆఫ్ఘాన్ పై కష్టపడి గెలిచిన శ్రీలంక!
ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ లో 233 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఆపసోపాలు పడుతూ ఛేదించింది. 48.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ ఆటతీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లంక వంటి బలమైన జట్టును ముప్పుతిప్పలు పెట్టిందని పొగడ్తలు వస్తున్నాయి. పెరీరా 26 బంతుల్లో 47 పరుగులు చేయడం లంకకు కలిసొచ్చింది. అంతకుముందు జయవర్థనే 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో హమీద్ హసమ్ 3, జాద్రాన్, షాపూర్ లకు చెరో వికెట్ దక్కాయి.